రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చుకుందాం

డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు

ప్రజాశక్తి – ఆకివీడు

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆశయం మేరకు రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చుకుందామని డిసిసిబి అధ్యక్షులు పివిఎల్‌.నరసింహరాజు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం ఆయన నగర పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో లాంచనంగా ప్రారంభించారు. ఛైర్‌పర్సన్‌ హైమావతి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. జగన్‌ పేదల ఆరోగ్యం కోసం తపిస్తున్నారన్నారు. ఆ లక్ష్యంతోటే ఆరోగ్యశ్రీ స్థాయిని 25 లక్షలకు పెంచారన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికల్లో అత్యంత జాగురూకతతో వ్యవహరించాలన్నారు. అనంతరం కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రూరల్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ కెసి.రెడ్డి మురళీ, ఎఎంసి ఛైౖర్మన్‌ షేక్‌ హసీనా, వైస్‌ ఛైర్‌ పర్సన్‌ పుప్పాల సత్యనారాయణ, పండు, యువజన నాయకుడు రమేష్‌, మెప్మా అధ్యక్షురాలు జ్యోతి, సీతారామయ్య పాల్గొన్నారు.

➡️