వైసిపి హయాంలో గ్రామాలాభివృద్ధి : పివిఎల్‌

ప్రజాశక్తి – పాలకోడేరు
వైసిపి పాలనలో గ్రామాలాభివృద్ధి ముందుకు సాగుతోందని డిసిసిబి ఛైర్మన్‌, ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌.నరసింహరాజు అన్నారు. మండలంలోని గరగపర్రులో జల జీవన్‌ పథకంలో మంజూరైన రూ.3.50 లక్షలతో ఎస్‌సి కాలనీలో పైపులైన్‌ నిర్మాణానికి, కోడుగట్టు రాజులు వీధి ప్రాంతంలో జెడ్‌పి నిధులు రూ.10 లక్షలతో, ఊర చెరువు ప్రాంతంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ రూ.4 లక్షల నిధులతో డ్రెయినేజీల నిర్మాణానికి ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటి రాజు)తో కలిసి పివిఎల్‌ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి తోకల సునీత సాల్మన్‌రాజు, వత్సవాయి రామరాజు, ఎంపిటిసి సభ్యులు షేక్‌ పాపాసాహెబ్‌, తమ్మిశెట్టి అబ్బులు, కోడూరి నాగేశ్వరరావు, భూపతిరాజు వంశీకృష్ణంరాజు, కొత్తపల్లి కాశీవిశ్వనాథరాజు, చింతలపాటి సూర్యనారాయణరాజు, విస్సాకోడేరు సర్పంచి బొల్లా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

➡️