సూర్యప్రభకు పిహెచ్‌డి పట్టా

పలువురి అభినందనలు
ప్రజాశక్తి – కాళ్ల
నిరంతరం శ్రమిస్తే విజయం తప్పక వరిస్తుందని ఏ కవి అన్నారో కానీ.. చాలామంది విషయాల్లో అది నిజమౌతుంది. ఏదైనా సాధించాలంటే పట్టుదల, తపన, కోరిక ఉండాలే గానీ.. ఎంతటి విజయమైనా ముందుకు వచ్చి తీరాల్సిందే. అనుకున్నది సాధించాలంటే సంకల్పం తోడై ఉండాలి. పేద కుటుంబం నుంచి సూర్యప్రభ ఎంతో పట్టుదలతో, కృషితో పిహెచ్‌డి పట్టా అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా పిహెచ్‌డి పట్టా పొందడమంటే అంత సులువు కాదు. ఎంతో కష్టపడాలి, నిర్ణీత సమయానికి ప్రాజెక్టులు చేయాలి, గైడ్‌ చుట్టూ తిరగాలి, కేవలం అదే పనిమీద శ్రమిస్తున్నవారు సైతం తమ పిహెచ్‌డి పూర్తవ్వాలంటే ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాల్సి ఉంటుంది. అలాంటిది ఒక అధ్యాపకురాలు పిహెచ్‌డి పూర్తి చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం మారుమూల గ్రామమైన ప్రాతళ్లమెరకకు చెందిన దాకారపు సూర్యప్రభ సాధించిన విజయం ఇది.పట్టుదలతో పిహెచ్‌డిడి.సూర్యప్రభ ప్రాతళ్లమెరక గ్రామంలో సిబిసిఎన్‌సి పాఠశాలలో ప్రాథమిక విద్య, ఏలూరుపాడులో మాధ్యమిక విద్య, ఇంటర్‌, డిగ్రీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ భీమవరం డిఎన్‌ఆర్‌ కళాశాలలో చదివి, పిహెచ్‌డి ఆంధ్రా యూనివర్సిటీలో చేశారు. ప్రాతళ్లమెరక గ్రామంలో దాకారపు ధర్మారావు, జయభారతి కుమార్తె దాకారపు సూర్యప్రభ గతేడాది డిసెంబర్‌ తొమ్మిదో తేదీన విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో ఆంధ్రా యూనివర్సిటీ పిసి ప్రొఫెసర్‌ ప్రసాద్‌రెడ్డి చేతుల మీదుగా పిహెచ్‌డి పట్టా అందుకున్నారు. కల నెరవేరిందిదాకారపు సూర్యప్రభ, అధ్యాపకురాలు, ప్రాతళ్లమెరకడిగ్రీ చదివే సమయంలో పిహెచ్‌డి చేయాలని మనుసులో బలంగా ఏర్పడింది. ప్రస్తుతం పిహెచ్‌డి పట్టాను సాధించి కలను నెరవేర్చుకున్నాను. మంచిగా చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలనుకున్నాను. ప్రస్తుతం డిఎన్‌ఆర్‌ కళాశాలలో అర్ధశాస్త్రం అధ్యాపకురాలిగా పని చేస్తున్నాను.

➡️