ఆచంట కచేరి సెంటర్లో  2వ రోజు  కొనసాగుతున్న నిరాహార దీక్షలు

Dec 13,2023 15:46 #West Godavari District
anganwadi protest 2nd day wg achanta

ప్రజాశక్తి-ఆచంట : ఆచంటకచేరి సెంటర్లో ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  సిఐటియు పిలుపులో భాగంగా బుధవారం రెండో రోజు  నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా  అంగన్వాడీ కార్యకర్తలకు  సిపిఎం మండల కమిటీ సభ్యులు,  పి మోహన్ రావు, సిర్రా  నరసింహమూర్తి , కుసుమే జయరాజు, నేతలు తలుపూరి బుల్లబ్బాయి, తోటపల్లి సత్యనారాయణ, మన్నే బ్రహ్మయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం  జిల్లా అధ్యక్షులు, దాసిరెడ్డి కోటేశ్వరరావు, సిపిఐ జిల్లా ఏరియా నాయకులు శారా జోషి  సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలు ఉద్దేశించి  సిఐటియు  మండల కార్యదర్శి వద్దిపర్తి అంజి బాబు మాట్లాడుతూ చిన్నారులు బాలింతలు గర్భిణీ స్త్రీలు లకు అనేక సేవలందిస్తున్న అంగన్వాడి లను  కేంద్రానికి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు.  ఈ సందర్భంగా ఆచంట మండలం నుంచి 76 సెంటర్లో ఉన్న అంగన్వాడీలు దీక్షలో పాల్గొని  భగభగ  మండే సూర్యుని చూడు అంగన్వాడి సత్తా చూడు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వైట్ల ఉషారాణి, కార్యకర్తలుమైలే విజయలక్ష్మి, బి రాణి, సత్యవతి, నాగలక్ష్మి, శ్రీదేవి, బేబీ రాణి, పద్మావతి, కమల, మల్లేశ్వరి  తదితరులు  

➡️