కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు

Jan 11,2024 16:06 #West Godavari District
anganwadi workers strike 31day in wg gokavarm

ప్రజాశక్తి-గణపవరం : కనీస వేతనాలు అమలు చేయాలని గత 31 రోజులుగా సమచేస్తున్న అంగన్వాడీలు గురువారం గణపవరంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్ వర్కర్స్ యూనియన్ మండల కమిటీ నాయకురాలు బి రామకోటి మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 31 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. యస్మాలు నోటీసులు అరెస్టులుకి తమ భయపడమని అన్నారు. ఈ కార్యక్రమంలో కె.వి మహాలక్ష్మి బండారు పార్వతి సిహెచ్ సీతామాలక్ష్మి ధనలక్ష్మి కళ్యాణి జయలక్ష్మి పాల్గొన్నారు.

➡️