దత్త సాయి మందిరంలో అన్న సమారాధన

ప్రజాశక్తి – మొగల్తూరు

మండల కేంద్రం మొగల్తూరులోని కోట రోడ్‌లో ఉన్న దత్త సాయి మందిరంలో గురువారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ సందర్భంగా యాత్రికులు బాబా వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధనలో అధిక సంఖ్యలో యాత్రికులు పాల్గొన్నారు. ఈ అన్న సమారాధనకు పేట సూర్యప్రకాష్‌ రూ.2,500 నగదు, తోట శ్రీనివాసరావు, గుబ్బల శ్రీనివాసరావు, పెద్దమల్లు సూర్యతేజ(సూర్య బిస్కెట్స్‌), దత్తసాయి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో అన్న సమారాధన ఏర్పాట్లు చేశారు.

➡️