ఉత్తమ ఎంపీడీవోగా జ్యోతిర్మయి

Jan 26,2024 15:30 #West Godavari District
best services award to mpdo

ప్రజాశక్తి-గణపవరం : మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గణపవరం ఎంపీడీవో జి జ్యోతిర్మయికి గణతంత్ర వేడుకలు సందర్భంగా భీమవరంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో జి జ్యోతిర్మయికి జిల్లా కలెక్టర్ ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమ ఎంపీడీవో అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతిర్మయి మాట్లాడుతూ అవార్డులు బాధ్యతలను పెంచుతాయని అన్నారు. రానున్న రోజుల్లో మండలాన్ని వరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేస్తానని చెప్పారు. ఎంపీడీవో జ్యోతిర్మయికి అవార్డు అందుకున్న సందర్భంగా మండల ఎంపీపీ దండు వెంకటరామరాజు ఈవో పి ఆర్ డి పీవీ సత్యనారాయణ మండలంలో కార్యదర్శులు సర్పంచులు మండల కార్యదర్శి సిబ్బంది అభినందనలు తెలిపారు.

➡️