దేశ సంపదను కార్పొరేట్లకు కట్టపడుతున్న మోడీ

Mar 23,2024 16:44 #West Godavari District

భీమవరంలో ఘనంగా భగత్ సింగ్ 93 వ వర్ధంతి

ప్రజాశక్తి-భీమవరం : దేశ సంపద ప్రజలకు చెందాలని నాడు భగత్ సింగ్ ఉరి కంభం ఎక్కితే నేడు మోడీ ప్రజల సంపదను కార్పొరేటర్లు కట్టబెడుతున్నాడని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి కే క్రాంతి బాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ ఆరోపించారు. భగత్ సింగ్ అల్లూరి విజ్ఞాన కేంద్రం లో భగత్ సింగ్ 93వ వర్ధంతి సభ శనివారం నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్రాంతి బాబు సత్యనారాయణ మాట్లాడుతూ నాడు తెల్లదొరలను తరిమికొట్టేందుకు భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లాంటి విప్లవ వీరులు తమ ప్రాణాలను తునప్రాయంగా అర్పించారన్నారు. నేడు భగత్ సింగ్ వారసులుగా రైతుల సమస్యలపై ఢిల్లీ సరిహద్దుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతుంటే నల్లదొరలు నేడు కార్పొరేట్లకు మేలు చేసేందుకు తీవ్ర నిర్బంధాన్ని తుపాకీలను ఉపయోగిస్తున్నారన్నారు. దేశ సంపదను మోడీ గుజరాత్ కార్పొరేటు ముఠా కి కట్టబెట్టేందుకు చేయ నీ ప్రయత్నం లేదన్నారు. రానున్న రోజుల్లో భగత్ సింగ్ ,రాజు గురు సుఖదేవ్ అల్లూరి సీతారామరాజు లాంటి వారసులుగా పోరాటాన్ని తీవ్రతరం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మణికుమారి, టి.జ్యోతి, పి.సాయి, కె.అంజలి పాల్గొన్నారు.

➡️