పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్

Feb 14,2024 12:19 #West Godavari District
prasanth as wg collector

ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి జిల్లా) : పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సుమిత్ కుమార్ గాంధీ నియమితులయ్యారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ప్రశాంతి బదిలీ అయ్యారు. ఆమెను వ్యవసాయ మార్కెట్ శాఖ కమీషనర్ గా నియమించారు. సుమిత్ కుమార్ గతంలో నర్సాపురం సబ్ కలెక్టర్ గా పనిచేసారు. ప్రస్తుతం అల్లూరి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా భాధ్యతలు అప్పగించారు. గత కలెక్టర్ ప్రశాంతి 2022 ఏప్రిల్ 4న విభజిత జిల్లాకు కలెక్టర్గా వచ్చారు. 19 నెలల పాటు ఆమె ఇక్కడ సేవలందించారు.

➡️