ఆచంటలో ‘పది’ పరీక్షలు

Mar 18,2024 11:03 #West Godavari District

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలంలో పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంత వాతావరణంలో   ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఈ నెల 30 వరకు ఈ పరీక్షలో జరగనున్నాయి. మండలంలోఆచంట, ఆచంట వేమవరం, పెనుమంచిలి, కొడమంచిలి, కరుగోరు మిల్లి, వల్లూరు ఎంపీ పాలెం, భీమలాపురం, కోడేరు తోపాటు  హోలీ ఏంజెల్స్, స్నెక్  ఇంగ్లీష్ మీడియం స్కూల్  సంబంధించి విద్యార్థులు పరీక్షల్లో రాయనున్నారు.  మండలంలో ఆచంట, కొడమంచిలి, వల్లూరు, ఆచంట వేమవరం కేంద్రాల్లో 528 మంది విద్యార్థులు పరీక్ష లు రాయున్నట్లు ఎంఈఓ ఏ ఉషారాణి తెలిపారు. మండలంలో కొడమంచిలి, వల్లూరు గ్రామాల్లో, సీసీ కెమెరాలు నిఘాలో పరీక్షలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్షా కేంద్రాల్లో  ఆచంట వేమవరం, వల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులో, ఓ ఆర్ ఎస్ ద్రావణం, త్రాగునీరు వంటివి అందుబాటులో  ఉంచారు.

➡️