సమస్యలు పరిష్కరించండి : ఆర్డీఓకి వినతి

Dec 18,2023 17:06 #West Godavari District
wg anganwadai strike continue 7th day

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం :  అంగన్ వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకు సెక్టార్ లు ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కార్యాలయం వద్ద వరకు ఏడవ రోజు సమ్మె కార్యక్రమంలో భాగంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ ర్యాలీకి తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ సంఘీభావం తెలిపింది. ర్యాలీ అనంతరం స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ ర్యాలీ ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామోహనరాయ్, కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, ఆంధ్రప్రదేశ్ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.ఝాన్సీలక్ష్మీ,ఎ.అజేయకుమారి ప్రాజెక్టు అధ్యక్షురాలు దీన స్వరూపరాణి,జి.గాయత్రి ప్రసన్న, ప్రబారాణి లు మాట్లాడుతూ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ కు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నెలకు 26 వేలు జీతం ఇవ్వాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఐసిడిఎస్ సెంటర్లను బలోపేతం చేయాలని, రిటైర్మెంట్ తర్వాత 5 లక్షలు ఇవ్వాలని, యాప్ సిస్టం ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అంగనవాడి బ్రతుకులు మారడం లేదని వారు అన్నారు. అంగనవాడి కోరికలు గొంతమ్మ కోరికలు కాదని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కనీస వేతనం 26000 వేలు ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని, 2022లో సుప్రీంకోర్టు అంగనవాడీలకు గ్రాడ్యూటీ అమలు చేయాలని, అనేక రాష్ట్రాలులో అమలు జరుగుతున్న మన రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేయటం లేదని వారు అన్నారు. అంగనవాడీలకు ఇస్తున్న గౌరవ వేతనం 11500 రూపాయలకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయనని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని, ఒక పక్కన నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని పెట్రోలు, డీజిల్,గ్యాస్, కరెంటు బస్సు చార్జీలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా వారి జీవితాలు బ్రతకడమే కష్టంగా ఉందని కావున ప్రభుత్వం జోక్యం చేసుకొని వారు సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడ బిడ్డలను బాధ పెట్టిన ఏ ప్రభుత్వం కూడా మనుగడ ‌చాదించలేదని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మెను నిరంకుశంగా దుర్మార్గంగా అణచివేయాలని చూస్తుందని, అంగనవాడీ సెంటర్లు తాళాలు పగులగొట్టి సచివాలయం వాలంటీర్లు వ్యవస్థతో నడపాలని చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచమన్నందుకు అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా ప్రతినిధులకు, మంత్రులకు అంతులేని అలవెన్సులు, ఖర్చులు అధికంగా చెల్లింస్తున్నారని వారు ఆవేదన వ్యక్తంచేశారు.గత 30 సంవత్సరాలు నుండి పనిచేస్తున్న అంగనవాడీలను కాదని వేరే వారితో పని చేయించడం ఎంతవరకు సమంజసం అని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సమస్యలు పరిష్కరించని నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి తగు బుద్ది చెబుతామని హెచ్చరించారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ అమలు చేయాలని, ఐసిడిఎస్ సెంటర్లను బలోపేతం చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పతివాడ నాగేంద్రబాబు, యడవల్లి వెంకట దుర్గారావు,తాడేపల్లిగూడెం, గణపవరం, తణుకు మండలాల అంగనవాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

➡️