మంచి జరిగితేనే ఓటు

Feb 1,2024 13:11 #West Godavari District
ycp election campaign

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) :  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయమని అన్న దమ్మున్న నాయకుడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్ కుమార్ అన్నారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా  ఆచంట మండలం ఆచంట వైసిపి కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం  జరిగింది. ఈ సమావేశంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 3వ తేదీ శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో జరుగునున్న సిద్దం భారీ బహిరంగ సభకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిమంది  తరలివెళ్లాలనీ పిలుపునిచ్చారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ని ఎదుర్కోవడానికి ప్రతిపక్ష నేతలందరూ ఏకమైన ఏమిచేయాలేక చివరకు వైఎస్ఆర్ కుటుంభాన్ని చీల్చి జగనన్న పైకి ఉసిగొల్పి నిచరాజకీయలకు దిగజారుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసిపి  జిల్లా కార్యదర్శి దేవిరెడ్డి రాంబాబు,లీగల్ సెల్ అధ్యక్షుడు వస్క ఉమేష్, మండల కార్యదర్శి మనవర్తి విజయ్ కుమార్, గుత్తులు రామకృష్ణ, బాలిన వీరస్వామి, మనవర్తి శుభాకర రావు, అరుపల్లి వినయ్, కేత రామకృష్ణ, చామన శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

➡️