కోలగట్ల సహకారంతోనే భూ ఆక్రమణలు : కాళ్ల

Apr 13,2024 21:12

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చేస్తున్న అరాచకాలు, ఆక్రమణలను తాము రుజువు చేసేందుకు తాము సిద్ధమని, కోలగట్ల సిద్ధమేనా అని అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ కాళ్ల గౌరీశంకర్‌ సవాల్‌ చేశారు. శనివారం తన నివాసంలో మాజీ కౌన్సిలర్‌ గాడుఅప్పారావు, మరికొంతమంది అనుయాయులమతో కలసి మీడియాతో మాట్లాడారు. ఇటీవల జరిగిన వైసిపి సమావేశంలో ఆక్రమణలు రుజువు చేయాలని, చేస్తే నామినేషన్‌ వెయ్యబోనని చెప్పిన కోలగట్ల సవాల్‌ను స్వాగతిస్తున్నామని అన్నారు. నామినేషన్‌ వేసినా , వెయ్యకపోయినా ప్రజలు కోలగట్లకు ఎలా తీర్పు ఇవ్వాలో నిర్ణయించుకున్నారన్నారు. కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నవారు, బిల్డర్లు ఆక్రమణలన్నీ కోలగట్ల నేతృత్వంలోనే చేశారని ఆరోపించారు. డబుల్‌ కాలనీ దగ్గర రాజమన్నార్‌ దేవాలయం భూమి పది ఎకరాలు అక్రమించరన్నారు. ఇది కోలగట్లకు తెలియదా అని ప్రశ్నించారు. దాసన్నపేట సర్వే నెంబర్‌ 815 లో ఎర్ర చెరువు ఏమైందని ప్రశ్నించారు. ఆక్రమించేసిన వారు ఎవరని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. జమ్ములో ఉన్న భూమి కోర్టు స్టాట్సకోలో ఉంటే పట్టాలు ఇచ్చేసి అమ్మేస్తున్నారన్నారు. రోటరీ క్లబ్‌,ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, మీడియా మధ్యవర్తిత్వం లో ఆక్రమించిన చెరువు, కబ్జా భూములు చూపిస్తానని, అందుకు మధ్యవర్తిత్వం వహించాలని రోటరీ క్లబ్‌ , ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు రాసిన లేఖ మీడియాకు చూపించారు.

➡️