నీటి కోసం మహిళల ఆందోళన

ప్రజాశక్తి-పెద్దదోర్నాల: నీటి కోసం మహిళలు గురువారం ఆందోళన బాట చేపట్టారు. పెద్దదోర్నాల పట్టణంలోని వడ్డెర కాలనీ, పీర్ల చావిడి వీధి, ఐనముక్కలలోని దాసరి కాలనీలతో పాటు పలు వీధులకు చెందిన మహిళలు నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వారంతా పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వ కాంట్రాక్టర్లు ట్యాంకర్ల ద్వారా నీళ్లు తోలడం నిలిపివేశారు. పూర్తి స్థాయిలో టిడిపి కాంట్రాక్టర్లు ఇంకా నీళ్లు తోలడం ప్రారంభించలేదు. దీంతో నీటి సమస్య ఉత్పన్నమైంది. నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. స్పందించిన పంచాయతీ కార్యదర్శి మోహన్‌రావు మహిళలకు సర్ధి చెప్పారు. వారం రోజుల్లో సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందని తెలిపారు. దీంతో మహిళలు ఆందోళనను నిలిపివేశారు.

➡️