గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Apr 11,2024 21:06

ప్రజాశక్తి – సీతంపేట:  గెలుపే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెసి నాయకులు పనిచేయాలని ఉమ్మడి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు. స్థానిక టిడిపి కార్యాలయంలో ఉమ్మడి మండలాల పార్టీ అధ్యక్షులు సవరతోట మొఖలింగం (టిడిపి), బిడ్డిక విశ్వనాథం (జనసేన), ఆరిక అమల (బిజెపి) ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయకృష్ణ మాట్లాడుతూ మండలం నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జనసేన, టిడిపి, బిజెపి నాయకులు గర్భాన సత్తిబాబు, గేదెల చిరంజీవి, సవర జమయ్య, టి.తేజోవతి, ఆర్‌.రంగనాథం, ఇమరక పవన్‌, గంట సుధ, తోయిక సంధ్యారాణి నియోజకవర్గ ఉమ్మడి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.అనంతరం సోమగండిలో కూటమి ప్రచారం నిర్వహించారు. భామిని : క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ గుర్తు గ్లాస్‌ ను, ప్రజలులోకి తీసుకువెళ్లి, మన ప్రభుత్వం లో చేపట్టే కార్యక్రమాలు వివరించి, అత్యధిక మెజారిటీ భామిని మండలం లో సాధించాలని పాలకొండ టి డి పి, జనసేన, బి జె పి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకష్ణ తెలిపారు. భామినిలోని టిడిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమం లో తూర్పుకాపు నాయకులు పి.కష్ణమూర్తి నాయుడు, జనసేన ఉపాధ్యక్షులు గుర్బనా సత్తి బాబు, నిమ్మక పాండురంగరావు, టి డి పి నాయకులు తేజోవతి, మండల టి డి పి అధ్యక్షులు బి. రవినాయుడు, ప్రధాన కార్యదర్శి ఎం. జగదీశ్వరరావు, సీతంపేట మండల టిడిపి అధ్యక్షులు సవర తోట ముఖలింఘం, మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరఘట్టం: జనసేన అధినేత కొణిదల పవన్‌ కళ్యాణ్‌ లేకపోతే జయకృష్ణకు పాలకొండ టికెట్టు వచ్చేది కాదని అరకు పార్లమెంటరీ బీసీ సెల్‌ కన్వీనర్‌ పి.కృష్ణమూర్తి నాయుడు అన్నారు. స్థానిక జామివారి కాంప్లెక్స్‌ లో కూటమి సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి జనసేన విజయకేతనానికి కషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల, పట్టణ టిడిపి అధ్యక్షులు ఉదయాన ఉదరు భాస్కర్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️