పేదల భవిష్యత్తు కోసం యజ్ఞం చేశా

ప్రజాశక్తి – కడప ప్రతినిధి సచివాలయాల్లో పౌరసేవలు, వాలంటీర్లతో అవ్వాతాతలకు ఇంటికే వచ్చి పెన్షన్‌ ఇవ్వడం, ఇంటికే వచ్చి రేషన్‌ పంపిణీ చేయడం, ఆర్బీకే వ్యవస్థ, విలేజ్‌ క్లినిక్‌, నాడు-నేడుతో స్కూళ్లు, ఇంగ్లీష్‌ మీడియం, మహిళా పోలీస్‌, ఫోన్లలో దిశా యాప్‌ వంటి సేవలతో పేదల భవిష్యత్తు కోసం యజ్ఞం చేశానని ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరం లోని పొట్టిశ్రీరాములు కూడలిలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకో లేనిదని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బంది పెడితే, ఇండిపె ండెంట్‌గా 5.45 లక్షల ఓట్ల మెజార్టీతో ఆదుకుందని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకారం చేస్తుండగా, పార్లమెంట్‌ మొత్తం ఎవరీ జగన్‌ అని చూసిందని తెలి పారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు మైనార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన ఎన్‌డిఎ కూటమితోనే ఉంటాడట, ముస్లిమ్‌ రిజర్వే షన్లను బాహాటంగా వ్యతిరేకిస్తున్న బిజెపితోనే జతకట్టడం ఆయనకే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఎన్‌ఆర్‌సి, సిఎఎ వంటి అంశాల్లోనూ తాను ముస్లిములకు మద్దతుగా ఉంటానని తెలిపారు. 59 నెలల పాలనా కాలంలో ఇంగ్లీష్‌ మీడియం మొదలుకుని ఐబి సిలబస్‌ వరకు ప్రయాణించామని తెలిపారు. ఉన్నత చదువులకు అండగా ఉంటానని చెప్పారు. ఫీజురియి ంబర్స్‌మెంట్‌తోపాటు విద్యా వసతి, విద్యాదీవెన సదుపా యాల్ని కల్పించానన్నారు. అంతర్జాతీయ యూని వర్శిటీలతో ఆన్‌లైన్‌ కోర్సుల సదుపాయాల్ని కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను మహిళల పేరిట ఇచ్చామన్నారు. రైతుభరోసా, ఉచిత పంటల బీమా, తొమ్మిది గంటల విద్యుత్‌, ఆర్బీకేలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాహన మిత్ర, నేతన్ననేస్తం, మత్స్సకార భరోసా, నాయీలకు, చేయూత, లానేస్తంతో పాటు ఇతర స్వయంఉపాధి రంగాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రూ.25 లక్షలతో కూడిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీడాక్టర్‌, ఇంటింటికీ వెళ్లి టెస్టులు చేస్తున్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇన్నిన్ని పథకాలను తెచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. లంచాలు, వివక్ష లేని పాలన అందించానని తెలిపారు. రూ.2.70 లక్షల కోట్లను అర్హులైన పేదల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మీకోసం 130 సార్లు బటన్‌ నొక్కానని, మీ భవిష్యత్‌ కోసం రెండు బటనులు నొక్కాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ మీఇంటికి చేరా లంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌బి అంజద్‌బాషా, పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి శాసన మండలి ఉపాధ్యక్షులు జఖియా ఖానం పాల్గొన్నారు.అండగా ఉంటానని చెప్పారు. ఫీజురియింబర్స్‌మెంట్‌తోపాటు విద్యా వసతి, విద్యాదీవెన సదుపా యాల్ని కల్పించానన్నారు. అంతర్జాతీయ యూని వర్శిటీలతో ఆన్‌లైన్‌ కోర్సుల సదుపాయాల్ని కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్‌, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలను మహిళల పేరిట ఇచ్చామన్నారు. రైతుభరోసా, ఉచిత పంటల బీమా, తొమ్మిది గంటల విద్యుత్‌, ఆర్బీకేలను ఏర్పాటు చేశామని తెలిపారు. వాహన మిత్ర, నేతన్ననేస్తం, మత్స్సకార భరోసా, నాయీలకు, చేయూత, లానేస్తంతో పాటు ఇతర స్వయంఉపాధి రంగాలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. రూ.25 లక్షలతో కూడిన ఆరోగ్యశ్రీ, ఆరోగ్యఆసరా, విలేజ్‌ క్లినిక్స్‌, ఫ్యామిలీడాక్టర్‌, ఇంటింటికీ వెళ్లి టెస్టులు చేస్తున్న ఆరోగ్య సురక్ష వంటి పథకాలను అమలు చేశామని పేర్కొన్నారు. ఇన్నిన్ని పథకాలను తెచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. లంచాలు, వివక్ష లేని పాలన అందించానని తెలిపారు. రూ.2.70 లక్షల కోట్లను అర్హులైన పేదల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. మీకోసం 130 సార్లు బటన్‌ నొక్కానని, మీ భవిష్యత్‌ కోసం రెండు బటనులు నొక్కాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ మీఇంటికి చేరా లంటే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్‌బి అంజద్‌బాషా, పార్లమెంట్‌ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి శాసన మండలి ఉపాధ్యక్షులు జఖియా ఖానం పాల్గొన్నారు.

➡️