పేదల భూములు వెనక్కి తీసుకున్న వైసిపి

May 6,2024 21:31

ప్రజాశక్తి-విజయనగరం కోట: పేదల భూములు వెనక్కి తీసుకున్న ఘనత వైసిపి ప్రభుత్వానికే దక్కుతుందని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. సోమవారం 37వ డివిజన్‌ లో బిసి కోలనీ, గాంధీ పార్క్‌ ఏరియా, కోట పార్క్‌ ఏరియా, మజ్జుల వీధి, రామాలయం ఏరియా, శ్రీనివాసనగర్‌ ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలకు వివరించారు. వైసిపి అభ్యర్థి కోలగట్ల జగన్‌ను చూసి కాదు తనను చూసి ఓటేయ్యండి అంటున్నారంటే ఇది చేతకాని ప్రభుత్వమని అర్ధం చేసుకోవాలన్నారు. ఆయను చూసి ఎందుకు ఓటేయాలని, దొంగ పట్టాలు ఇచ్చినందుకా అంటూ ప్రశ్నించారు. విజయనగరాన్ని అభివృద్ధి చేయకపోయినా ఆయన మాత్రం అభివృద్ధి చెందారని అన్నారు. ఈ నేపథ్యంలో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు , వేచలపు శ్రీనివాసరావు అవనాపు విజరు, పిల్లా విజరు కుమార్‌, గాడు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మద్దతు తెలిపిన లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ లారీ ఓనర్స్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు టిడిపి అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి రాజును కలిసి మద్దతు తెలిపారపు. కార్యక్రమంలో అసోసియేషన్‌ కార్యదర్శి ఎన్‌.రాజేష్‌ రాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ అమర శ్రీనివాసరావు, మాజీ కార్యదర్శి కాళ్ల కష్ణ, డి. రామరాజు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాలనుపరిశీలించిన కలిశెట్టి జెఎన్‌టియులో జరుగుతున్న పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ను విజయనగరం పార్లమెంటు టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు సోమవారం పరిశీలించారు. ఉద్యోగులను కలిసి తమకు ఓటు వేయాలని అభ్యర్ధించారు. ఆయన వెంటనే పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు తదితరులు ఉన్నారు

➡️