సామన్యుడి కోసం రైళ్లేవీ!

Mar 14,2024 06:05 #edite page, #trains

రైళ్ళు ఎవరి కోసం నడుపు తున్నారో అర్థం కావటంలేదు. ఈ మధ్య అన్నీ ఎ.సి రైళ్ళు నడుపు తున్నారు. వందేభారతం, వందే మాతరం అంటూ ఎ.సి లోనే డబల్‌ డెక్కర్‌ అంటూ సామాన్యుడు ఎక్కలేని రైళ్లువేస్తున్నారు. రేపు కొత్తగా విశాఖ నుండి హైదరబాద్‌, విశాఖ పూరి నడుపుతారట. ఈ రైళ్లు వస్తుంటే మిగతా రైళ్లు పక్కకు తప్పుకొని వీటికి దారి ఇవ్వాలి. ఈ ఎ.సి రైళ్లలో కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆధికారులు… వీళ్ళందరికీ ఫ్రీ సర్వీసు. ప్రజాధనంతో వీళ్లు ప్రయాణం చేస్తుంటారు. ఇంకా బాగా డబ్బున్నవాళ్లు ఈ రైళ్ళు ఎక్కుతారు. సామాన్యుడు వీటి ముఖం కూడా చూడరు. డబల్‌ డెక్కర్‌ అనేది ఎ.సి ప్రయాణికులకేనా? పాసెంజర్‌ రైళ్ళు డబల్‌ డెక్కర్‌ వెయ్య కూడదా…గతంలో హైదరబాద్‌ నగ రంలో డబల్‌ డెక్కర్‌ సిటీ బస్సులు ఉండేవి. అవి ఎక్కితే అదో రకం అనుభూతి కలిగేది. ఆ డబల్‌ డెక్కర్‌ రైళ్ళు మాములు పాసెంజర్‌ రైళ్లకు ఏర్పాటు చెయ్యండి. ఎ.సి రైళ్లు వేసి ఆదాయం బాగా పెంచుకుంటు న్నారు. మరి సీనియర్‌ సిటిజన్లకి గతంలో మాదిరి రాయితీ ఎందుకు ఇవ్వరూ? ఎన్నికలు వస్తున్నాయని ఆకాశానికి పెంచిన గ్యాస్‌ రేటును వంద రూపాయలు తగ్గించారు. ఎందుకు తగ్గించిందీ జనాలకు తెలుసు. కనుక ఇప్పటికైనా పాసెంజర్‌ రైళ్లు పెంచండి. ప్రతి ఎక్స్‌ప్రెస్‌ రైలుకి సగం జనరల్‌ బోగీలు తగిలించండి. సీనియర్‌ సిటిజన్లకి టికెట్‌ ధరలో రాయితీ పునరుద్ధరించండి. అప్పుడే కేంద్ర బిజెపి పాలకులను జనం నమ్ముతారు.

– నార్నె వెంకట సుబ్బయ్య

➡️