‘ఆ ఒక్కటి అడక్కు’ అంటున్న నరేష్‌

Feb 16,2024 19:15 #allari naresh, #movie

అల్లరి నరేష్‌ హీరోగా ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమా తెరకెక్కుతోంది. నరేష్‌ కెరియర్‌లో 61వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అంకం మల్లి అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నారు. చిలకా ప్రొడక్షన్స్‌ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి భరత లక్ష్మీపతి సహ నిర్మాత. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ అనౌన్స్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌తో పాటు ఒక గ్లింప్స్‌ కూడా రిలీజ్‌ చేశారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్‌, వైవా హర్ష, అరియనా గ్లోరీ తదితరులు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాతో జామీ లివర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. గోపి సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి అబ్బూరి రవి కథ అందించారు. ఈ సినిమాని మార్చి 22వ తేదీన రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. గతంలో ఈ టైటిల్‌తోనే రాజేంద్రప్రసాద్‌ హీరోగా ఇవివి సత్యనారాయణ ఓ చిత్రం తెరకెక్కించారు.

➡️