ఎస్‌ఎస్‌ఎంబీ 29 టీమ్‌ రెడీ..

Feb 13,2024 19:06 #maheshbabu, #movie

రాజమౌళి, మహేశ్‌బాబు కాంబోలో వస్తున్న ఎస్‌ఎస్‌ఎంబీ 29 నుంచి తాజా అప్డేట్‌ ఒకటి బయటికి వచ్చింది. ఈ సినిమాకు పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు వి.విజయేంద్ర ప్రసాద్‌ కథను అందిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, పి.ఎస్‌.వినోద్‌ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ సూపర్‌ వైజర్‌గా ఆర్‌.సి.కమల్‌ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మోహన్‌ బింగి, ఎడిటర్‌గా తమ్మిరాజు, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అండ్‌ స్టైలిస్ట్‌గా రమా రాజమౌళి పని చేయనున్నట్లు సమాచారం. వచ్చే నెలలోనే సినిమా లాంఛ్‌ చేయనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. యాక్షన్‌ అడ్వెంచరస్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం స్క్రిప్ట్‌ దశలో ఉంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం మహేశ్‌ తన లుక్‌ను కూడా మార్చుకున్నారు. ఇండోనేషియాకు చెందిన నటి చెల్సియా ఎలిజబెత్‌ ఇస్లాన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

➡️