‘కన్నప్ప’లో ప్రభుదేవా

Mar 4,2024 19:54 #telugu movies
Prabhudeva in 'Kannappa'

విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం రెండో షెడ్యూల్‌ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా కోసం ఇండియాలోని పలువురు స్టార్‌ క్యాస్ట్‌, టాప్‌ టెక్నీషియన్స్‌ పని చేస్తున్నారు. వరుసగా ఒక్కొక్కరి వివరాలను చిత్రబృందం తెలియజేస్తోంది. తాజాగా ఈ చిత్రం కోసం ఇండియన్‌ టాప్‌ కొరియెగ్రాఫర్‌, ప్రభుదేవా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. న్యూజిలాండ్‌లో ప్రభు దేవాకు చిత్ర యూనిట్‌ టీం స్వాగతం పలికింది. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్‌ బ్యానర్ల మీద మోహన్‌ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

➡️