కమల్‌ హాసన్‌ రూ.కోటి విరాళం

Mar 9,2024 19:10 #kamalhasan, #movie

దక్షిణ భారత సినీ నటుల సంఘం (నడిగర్‌ సంఘం) నూతన భవన నిర్మాణానికి తమిళ హీరో కమల్‌హాసన్‌ రూ.కోటి విరాళాన్ని అందజేశారు. సుమారుగా రూ.40 కోట్లతో ఈ భవన నిర్మాణం జరుగుతుండగా. పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అధ్యక్షుడిగా నాజర్‌, ఉపాధ్యక్షులుగా పూచి మురగన్‌, ప్రధాన కార్యదర్శిగా విశాల్‌, ట్రైజరర్‌గా హీరో కార్తి నిధుల కోసం కృషి చేస్తున్నారు. వీరితో సమావేశమైన కమల్‌ తన వంతుగా రూ.కోటి విరాళం చెక్కును అందజేశారు. ఇప్పటికే సూర్య రూ.25 లక్షలు, కార్తీ రూ.కోటి, విశాల్‌ రూ.25 లక్షలు భవన నిర్మాణం కోసం విరాళాలను అందజేశారు.

➡️