కలశ ట్రైలర్‌ విడుదల

Dec 10,2023 08:25 #bhanu sree, #movie

భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కలశ’. చంద్రజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లో కొండా రాంబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. డాక్టర్‌ రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం నాడు డైరెక్టర్‌ మలినేని గోపిచంద్‌ విడుదల చేశారు. ‘కలశ మూవీ ట్రైలర్‌ చాలా బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలీకుండా తెలివిగా కట్‌ చేశారు. దర్శకుడు రాంబాబుతో పాటు నిర్మాత, నటీనటులు, టెక్నీషియన్స్‌కు అల్‌ ది బెస్ట్‌’ అని గీపిచంద్‌ చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈనెల 15న సినిమా విడుదల కానుంది.

➡️