కీరవాణి కోడలిగా మురళీ మోహన్‌ మనవరాలు

Dec 13,2023 19:05 #movie

‘నాకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిలైంది. తనకు ఓ అమ్మాయి సంతానం. ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో తన వివాహం జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు సంతానం. ఈమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైపోయింది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంటికి కోడలిగా వెళ్లనుంది. పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది’ అని మురళీమోహన్‌ తన మనుమరాళ్ల పెళ్లి ముచ్చట్లు చెప్పారు. గత కొన్ని రోజులుగా ఈ విషయంపై వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా వాటిపై స్పందించారు. మురళీ మోహన్‌ కొడుకు పేరు రామ్‌ మోహన్‌. ఈయన ఏకైక కుమార్తె రాగ. కొద్దిరోజుల క్రితమే ఆమె బిజినెస్‌లో మాస్టర్స్‌ పూర్తి చేశారు. కీరవాణి రెండవ అబ్బాయి శ్రీసింహతోనే రాగ వివాహం జరగనుంది. ‘మత్తు వదలరా’ సినిమాతో హీరోగా పరిచయమైన శ్రీసింహ, ‘తెల్లవారితే గురువారం’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘ఉస్తాద్‌’ సినిమాలు చేశారు.

➡️