‘గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం :నాగవంశీ

Jan 1,2024 08:20 #movie, #naga vamsi

హైదరాబాద్‌: మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’ . సంక్రాంతి కానుకగా జనవరి 12న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సినిమా రిలీజ్‌ను ఉద్దేశించి తాజాగా చిత్ర నిర్మాత నాగవంశీ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రాన్ని ఉద్దేశించి గతంలో ఓ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్‌ను ఆయన షేర్‌ చేశారు. ”ప్రతి ఏరియాలో రాజమౌళి కలెక్షన్స్‌కు దగ్గరగా వెళ్తాం. కంటెంట్‌ విషయంలో నేను నమ్మకంగా ఉన్నా” అని ఆయన చెప్పారు.తాజాగా ఈ వీడియో క్లిప్‌ను షేర్‌ చేసిన ఆయన.. ”మీకు మళ్లీ చెబుతున్నా. మేము అదే మాట మీద ఉన్నాం.’గుంటూరు కారం’ను భారీగా విడుదల చేస్తాం. రిలీజ్‌ మాకు వదిలేయండి. సెలబ్రేషన్స్‌ ఏమాత్రం తగ్గకుండా చూసుకునే బాధ్యత మీదే” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.’అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేశ్‌బాబు – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. జగపతి బాబు, జయరాం, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకఅష్ణ దీనిని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్‌ చేయాలని కోరుతూ పలువురు అభిమానులు వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు.

➡️