ఘనంగా ”ట్రూ లవర్‌” సినిమా ప్రీ రిలీజ్‌

Feb 8,2024 17:15 #New Movies Updates

మణికందన్‌, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న సినిమా ”ట్రూ లవర్‌”. ఈ సినిమాను మిలియన్‌ డాలర్‌ స్టూడియోస్‌, ఎంఆర్‌ పీ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్స్‌ పై నజేరత్‌ పసీలియన్‌, మగేష్‌ రాజ్‌ పసీలియన్‌, యువరాజ్‌ గణేషన్‌ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్‌ వ్యాస్‌ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్‌ మారుతి, సక్సెస్‌ ఫుల్‌ ప్రొడ్యూసర్‌ ఎస్‌ కేఎన్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు తీసుకువస్తున్నారు. ఇవాళ ”ట్రూ లవర్‌” సినిమా ప్రీ రిలీజ్‌ మీట్‌ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌ వంశీ నందిపాటి, హీరోయిన్‌ శ్రీ గౌరి ప్రియ, హీరో మణికందన్‌, నిర్మాత ఎస్‌ కేఎన్‌, దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్‌ టైమ్‌ చూసినప్పుడు ఎలాంటి ఎగ్జైట్‌ మెంట్‌ కలిగిందో తమిళ ప్రీమియర్స్‌ తర్వాత సోషల్‌ మీడియాలో వస్తున్న పోస్ట్‌ లు చూస్తున్నప్పుడు అంతే సంతోషం కలిగింది. ”ట్రూ లవర్‌” సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌ గా తెరకెక్కించాడు. చాలా డీప్‌ గా థింక్‌ చేసి స్క్రిప్ట్‌ చేశాడు. డైరెక్టర్‌ గా ప్రభురామ్‌ వ్యాస్‌ టాలెంట్‌ ఇంప్రెస్‌ చేస్తుంది. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియెన్స్‌ కూడా ఎక్కడా ఇబ్బంది పడకుండా మూవీ చూడొచ్చు. ఈ సినిమాతో ఈ వాలెంటైన్స్‌ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను. మణికందన్‌, శ్రీ గౌరి ప్రియ పర్‌ ఫార్మెన్స్‌ లు ”ట్రూ లవర్‌” సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతాయి. ఈ జంటతో మా మాస్‌ మూవీ మేకర్స్‌ పై స్ట్రైట్‌ తెలుగు సినిమా చేస్తాం. ఎస్‌ కేఎన్‌ బేబి చేసినా, నేను ఇప్పుడు ప్రభాస్‌ గారితో సినిమా చేస్తూ బిజీగా ఉన్నా…ఇదొక మంచి సినిమా కావడం వల్లే ఇంతగా ప్రమోట్‌ చేస్తున్నాం. రేపు రాత్రి ప్రీమియర్స్‌ వేస్తున్నాం. తెలుగు ఆడియెన్స్‌ అంతా ”ట్రూ లవర్‌”ను ఇష్టపడతారని ఆశిస్తున్నాం. తెలుగులో ఇప్పటివరకు ఇలాంటి పాయింట్‌ తో సినిమా రాలేదు. తను ప్రేమించిన అమ్మాయి వేరే వారితో ఫ్రెండ్షిప్‌ చేస్తూ తనను అవైడ్‌ చేస్తే ఆ పెయిన్‌ ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు. దీన్ని దర్శకుడు చాలా ఆక్యురేట్‌ గా రూపొందించాడు అనిపించింది. అన్నారు.

➡️