జనవరి 1న ‘సర్కారు నౌకరి’

Dec 15,2023 19:05 #akash, #movie

గాయని సునీత కుమారుడు ఆకాష్‌ హీరోగా పరిచయవుతున్న సినిమా ‘సర్కారు నౌకరి’. ఈ చిత్రంలో భావన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఆర్కే టెలీ షో బ్యానర్‌పై రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. జనవరి 1న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

➡️