‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌

Jan 25,2024 19:10 #movie, #puri jaganadh

రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. ఈ చిత్రంలో సంజయ్ దత్‌ కీలక పాత్ర చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ నుండి పూరీ ఒక ఫొటోని షేర్‌ చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ మణిశర్మతో కలిసి పూరి జగన్నాథ్‌ ఈ పిక్‌లో కనిపిస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి సీక్వెల్‌ గా రూపొందుతోన్న ఈ చిత్రం అంచనాలకి మించి సక్సెస్‌ అవుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

➡️