నాగచైతన్య ‘తండేల్‌’ ప్రారంభం

Dec 9,2023 14:17 #New Movies Updates

అక్కినేని నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్‌’. ఈ చిత్రం హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ లోని గ్లాస్‌ హౌస్‌ లో ముహూర్తం షాట్‌ చిత్రీకరించారు. అక్కినేని నాగార్జున కెమెరా స్విచాన్‌ చేయగా..విక్టరీ వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టారు. నాగచైతన్య, సాయిపల్లవిలపై ఓపెనింగ్‌ షాట్‌ తీశారు. ఈ కార్యక్రమంలో గీతా ఆర్ట్స్‌ అధినేత అల్లు అరవింద్‌ పాల్గొన్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

➡️