‘పారిజాత పర్వం’ టీజర్‌

Mar 21,2024 19:05 #chaithanyarao, #movie

చైతన్య రావు, సునీల్‌, శ్రద్ధా దాస్‌, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన చిత్రం ‘పారిజాత పర్వం’. సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల చేయటానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న తరుణంలో తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్‌ చేసారు. ‘కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌’ అనే లైన్‌తో ప్రధాన పాత్రలను పరిచయం చేయటంతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. కథంతా కిడ్నాపుల చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. భీమవరం నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తిగా సునీల్‌ను చూపించారు. శ్రద్ధాదాస్‌ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

➡️