‘పుష్ప-2’ ఫొటో వైరల్‌

Jan 31,2024 19:30 #allu arjun, #movie

హీరో అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2. మరో 200 రోజుల్లో ఈ సినిమా విడుదల కానుందని ఇటీవల దర్శకుడు సుకుమార్‌ పోస్టర్‌ విడుదలలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి అల్లు అర్జున్‌ ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. షూటింగ్‌ సెట్‌లో అల్లు అర్జున్‌ చీర కట్టుకుని ఉన్న ఫొటో ఇది. నిజంగానే పుష్ప-2 సెట్‌లోని ఫొటో లీకైందా? లేదా ఎవరైనా మార్పింగ్‌ చేశారా? అని చర్చ నడుస్తోంది.

➡️