ఫిబ్రవరి 2న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు

Dec 26,2023 19:05 #movie, #suhas

‘సుహాస్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి పాత్రలో సుహాస్‌ కనిపించనున్నారు. దుశ్యంత్‌ కటికినేని దర్శకత్వం వహించారు. జీఏ2 పిక్చర్స్‌, దర్శకుడు వెంకటేష్‌ మహా బ్యానర్‌ మహాయన మోషన్‌ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కామెడీ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఫిబ్రవరి 2న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుపుతూ ఓ ఆసక్తికరమైన ఫొటోని చిత్రబృందం షేర్‌ చేసింది.

➡️