‘బచ్చన్‌’ సెట్స్‌లో ‘ఈగల్‌’ సందడి

Feb 11,2024 19:35 #movie, #raviteja

రవితేజ ‘ఈగల్‌’ సినిమా విడుదలై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రవితేజ పాల్గంటున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ సెట్స్‌లో ‘ఈగల్‌’ సంబరాలు నిర్వహించారు. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్‌’ సినిమా హిందీ ‘రైడ్‌’ సినిమాకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. భాగ్యశ్రీ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న ఈ షూటింగ్‌ లకేషన్‌లోనే ‘ఈగల్‌’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ జరిగాయి. హరీష్‌ శంకర్‌, రవితేజ, భాగ్యశ్రీ, ఇతర క్రూ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.

➡️