‘బిజినెస్‌మేన్‌’ చూసి ఎంపీనయ్యా : మల్లారెడ్డి

Nov 29,2023 08:45 #movie

మహేశ్‌బాబు నటించిన ‘బిజినెస్‌మేన్‌’ చూసి తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆ సినిమా స్ఫూర్తితోనే ఎంపీ అయ్యానని తెలంగాణా మంత్రి మల్లారెడ్డి అన్నారు. రణ్‌బీర్‌కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్‌’. ఈ సినిమా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మంత్రి మల్లారెడ్డి హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. ‘మహేశ్‌బాబు ‘బిజినెస్‌మేన్‌’ చూసి రాజకీయాల్లోకి వచ్చా. రణ్‌బీర్‌ కపూర్‌… మీకొక విషయం చెప్పాలనుకుంటున్నా. వచ్చే ఐదేళ్లలో మొత్తం హాలీవుడ్‌, బాలీవుడ్‌ను మా తెలుగువాళ్లు రూల్‌ చేస్తారు. మీరు హైదరాబాద్‌కు మారిపోవడం బెటర్‌. ఎందుకంటే, ముంబయి పాతబడిపోతుంది. బెంగళూరులో ట్రాఫిక్‌ జామ్‌ ఎక్కువ. అన్ని వసతులు కలిగిన ఏకైక నగరం హైదరాబాద్‌. తెలుగు వాళ్లు చాలా స్మార్ట్‌. మా దగ్గర రాజమౌళి, దిల్‌ రాజు, ఇప్పుడు సందీప్‌రెడ్డి ఉన్నారు.” అని అన్నారు. మల్లారెడ్డి మాటలకు మహేశ్‌బాబు, రణ్‌బీర్‌కపూర్‌, దర్శకుడు రాజమౌళి చిరునవ్వులు చిందించారు.

➡️