బుల్లితెర నటుడు పవిత్రనాథ్‌ మృతి

Mar 2,2024 19:05 #movie, #pavitranadh

తెలుగు బుల్లితెర నటుడు పవిత్రనాథ్‌ మరణించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలియజేశాయి. ‘చక్రవాకం’, ‘మొగలిరేకులు’ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు ఆయన బాగా దగ్గరయ్యారు. అయితే పవిత్రనాథ్‌ మరణం వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియలేదు. ఈ వార్తను మరో బుల్లితెర నటి, ఇంద్రనీల్‌ భార్య మేఘన సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసి తన సంతాపం తెలిపారు. ఈ విషాద వార్త తెలిసినప్పటి నుంచి పలు బుల్లితెర నటులు సోషల్‌ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

➡️