‘మిస్‌ పర్ఫెక్ట్‌’ ట్రైలర్‌ విడుదల

Jan 23,2024 19:10 #lavanya tripati, #movie

లావణ్య త్రిపాఠీ, అభిజీత్‌ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు కీలక పాత్రలు పోషించిన ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ వెబ్‌ సిరీస్‌ నుండి తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‌ని నిర్మించారు. విశ్వక్‌ ఖండేరావ్‌ దర్శకుడు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్‌ హాట్‌ స్టార్‌లో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ‘కొత్త టాలెంట్‌ ను ప్రోత్సహించడం అంటే నాగార్జున గారికి, నాగేశ్వరరావు గారికి చాలా ఇష్టం. అందుకే అన్నపూర్ణ సంస్థలో చాలా మంది కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ ‘మిస్‌ పర్ఫెక్ట్‌’ వెబ్‌ సిరీస్‌తో మేము అదే ప్రయత్నం చేశాం, అని నిర్మాత యార్లగడ్డ సుప్రియ అన్నారు.

➡️