‘రుధిరాక్ష’గా ఆది సాయికుమార్‌

Dec 15,2023 19:10 #adi saikumar, #movie

ఆది సాయికుమార్‌ హీరోగా, జె.డి.చక్రవర్తి, సత్యరాజ్‌ కీలక పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘రుధిరాక్ష’. శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజు జువ్వల నిర్మిస్తున్నారు. డార్క్‌, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రం శుక్రవారం రామానాయడు స్టూడియోలో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి సముద్రఖని క్లాప్‌ కొట్టగా రామ్‌ తాళ్లూరి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. దర్శకుడు దేవ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ‘యానిమల్‌’ ఫేం హర్షవర్షన్‌ రామేశ్వర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ప్రారంభం కానుందని నిర్మాత తెలిపారు.

➡️