‘రోటి కపడా’ ప్రీ ట్రైలర్‌ విడుదల

Mar 9,2024 19:30 #harsha, #movie

లక్కీ మీడియా అధినేత బెక్కం వేణుగోపాల్‌, సృజన కుమార్‌ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా’. హర్ష నర్రా, సందీప్‌ సరోజ్‌, తరుణ్‌, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్‌, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తారాగణంగా నటిస్తున్నారు. విక్రమ్‌రెడ్డి దర్శకుడు. ఏప్రిల్‌ 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ప్రీ ట్రైలర్‌ను హీరో శ్రీ విష్ణు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవిలో పెద్ద హిట్‌ సినిమాగా ‘రోటి కపడా’ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో హర్ష, తరుణ్‌, సుప్రజ్‌, సంతోష్‌రెడ్డి, సోనూ ఠాకూర్‌, పి.భరత్‌రెడ్డి తదితరులు పాల్గన్నారు.

➡️