వైజాగ్‌ అంటే నాకెంతో ఇష్టం : నాని

Dec 1,2023 08:51 #movie, #nani

‘నేను ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదుగానీ మీకు (విశాఖపట్నం వాసులు), నాకు మధ్య ప్రత్యేక బంధం ఉంది. నా యాక్షన్‌ చిత్రాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో పెద్ద హిట్‌ అయ్యాయి. ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు యూఎస్‌, హైదరాబాద్‌లాంటి ప్రాంతాల్లో ఎక్కువ విజయాన్ని పొందాయి. నేపథ్యం ఏదైనా అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడిన ప్రాంతం వైజాగ్‌. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని. జనవరిలానే డిసెంబరు కూడా సినిమాల పండగ నెలగా మారింది’ అని హీరో నాని అన్నారు. నాని హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హారు నాన్న. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈనెల ఏడోతేదీన సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బఅందం విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నటులు ప్రియదర్శి, విరాజ్‌ అశ్విన్‌, బేబీ కియారా తదితరులు పాల్గొన్నారు.

➡️