సంక్రాంతి చిత్రాల గందరగోళం

Dec 24,2023 08:59 #movie

సంక్రాంతి చిత్రాల విడుదల తేదీలపై దిల్‌ రాజు అధ్యక్షతన తెలుగు ఫిలిం ఛాంబర్‌లో తాజాగా నిర్మాతలు సమావేశమయ్యారు. నాగ వంశీ (గుంటూరు కారం), విశ్వ ప్రసాద్‌ (ఈగల్‌), శ్రీనివాస్‌ చిట్టూరి (నా సామి రంగ), ‘సైంధవ్‌’ చిత్ర నిర్మాత సెన్సారు కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో దర్శకుడు శైలేష్‌ కొలను ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో జనవరి 12న విడుదలయ్యే ‘గుంటూరు కారం’, ‘హనుమాన్‌’ నిర్మాతలని ఒకరోజు ముందుకు జరపాలని సూచించినా, ‘హనుమాన్‌’ నిర్మాతలు అందుకు ససేమిరా అన్నట్లు సమాచారం. తమకి హిందీ భాషతో ఒప్పందం అయిపొయింది కాబట్టి, ముందుకు జరగడం కష్టం అని చెప్పినట్టుగా తెలిసింది. తమ సినిమా కథ సంక్రాంతి పండగ నేపథ్యంలో ఉంటుంది కాబట్టి, విడుదల వాయిదా వెయ్యడం కష్టం అని ‘నా సామి రంగ’ నిర్మాత చెప్పినట్లు సమాచారం. ఇలా ఎవరూ విడుదల తేదీలపై ఏకాభిప్రాయానికి రాలేదు.

➡️