సర్దుకుపోవడం తెలుసు

Mar 27,2024 19:15 #movie, #vijay devarakonda

పరశురామ్‌ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ‘ఫ్యామిలీ స్టార్‌’ చిత్రం ఏప్రిల్‌ 5న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడడంతో ఇప్పటికే ప్రమోషన్‌ పనులు కూడా చిత్రబృందం మొదలుపెట్టింది. ఈ ప్రమోషన్‌లలో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ తన జీవితం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ముచ్చటించారు. ‘నా చిన్నతనం నుంచే జీవితంలో సర్దుకుపోవడం నేర్చుకున్నాను. స్కూల్‌కి వెళ్తున్న రోజుల్లో మా నాన్నను సైకిల్‌ కొనివ్వమని అడిగాను. ఆయన బర్త్‌డేకి కొంటాను… సెలవుల్లో కొంటాను అని సాగదీసి చాలా రోజులకు ఎప్పుడో కొనిచ్చారు. ఆ తర్వాత వీడియో గేమ్‌, కంప్యూటర్‌, టీవీ ఇలా చాలా విషయాల్లో అడ్జస్ట్‌ అయ్యాను. చిన్న వయసులో మాత్రమే కాదు ఇప్పటికి కూడా అనేక విషయాలలో సర్ధుకుపొతు జీవితాన్ని సాగిస్తున్నాను’ అని విజరు తెలిపాడు.

➡️