సాహస యాత్రలా సాగింది : చాందిని

Mar 6,2024 08:11 #chandini chowdary, #movie

‘గామి సినిమా ప్రయాణమంతా ఓ సాహస యాత్రలా సాగింది. నేను ఈ ప్రాజెక్టు మొదటి రోజు నుంచి ఉన్నాను. వారణాసి, కశ్మీర్‌, హిమాలయాలు.. ఇలా ఎన్నో సుందర ప్రదేశాల మధ్య సాగింది. కుంభమేళాలో అఘోరాల మధ్య కూడా చిత్రీకరణ జరిగింది’ హీరోయిన్‌ చాందినీ చౌదరి చెప్పారు. విష్వక్‌సేన్‌ ప్రధాన పాత్రలో విద్యాధర్‌ కాగిత తెరకెక్కించిన చిత్రం ‘గామి’. కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా చాందినీ చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘కొన్ని కథలు విన్నప్పుడు నన్ను నేను నియంత్రించుకోలేను. ‘గామి’ కథ విన్నప్పుడు నాకు అలాంటి అనుభూతే కలిగింది. నా మనసుకు చాలా తృప్తినిచ్చిన చిత్రమిది’ అని వివరించారు.

➡️