సైతాన్‌ ట్రైలర్‌ విడుదల

Feb 22,2024 19:05 #ajay devagan, #movie

బాలీవుడ్‌ నటుడు అజయ్ దేవ్‌గన్‌, మాధవన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం సైతాన్‌. హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రానికి వికాస్‌ భల్‌ దర్శకత్వం వహించారు. మార్చి 8న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. హాయిగా సాగిపోతున్న కబీర్‌ (అజరు) కుటుంబంలోకి ఓ అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. తరువాత ఎలాంటి చిక్కులు ఎదురయ్యాయో, వాటి నుంచి హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది కథ. మాధవన్‌ విలన్‌గా ఈ చిత్రంలో కనిపిస్తాడు. జియో స్టూడియోస్‌ సమర్పణలో అజరు దేవగన్‌, జ్యోతి దేశ్‌పాండే, అభిషేక్‌ పాఠక్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గుజరాతికి చెందిన ‘వష్‌’ సినిమాకు రీమేక్‌.

➡️