హాలీవుడ్‌కు ‘దృశ్యం’ : తొలి భారతీయ చిత్రంగా రికార్డు

Mar 1,2024 08:24 #mohanlal, #movie

తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన చిత్రం ‘దృశ్యం’. ఇప్పటికే పలు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం రీమేక్‌లలో మరో ఘనత సాధించింది. ఏకంగా హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌, స్పానిష్‌లలో రీమేక్‌ చేయనున్నట్లుగా ప్రకటించింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్‌ కానున్న మొదటి భారతీయ చిత్రంగా ‘దృశ్యం’ నిలిచింది. ముందుగా ఈ సినిమాను మోహన్‌లాల్‌, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. తెలుగులో వెంకటేష్‌ హీరోగా శ్రీప్రియ పార్ట్‌ 1 తెరకెక్కించగా, పార్ట్‌ 2ను జీతూ జోసెఫ్‌ తీశారు. హిందీలో అజయ్ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. వేర్వేరు దర్శకులు వాటిని రూపొందించారు. తమిళ్‌లో కమల్‌హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే మలయాళంలో ‘దృశ్యం’3 రానుంది.

➡️