1న యానిమల్‌ విడుదల

Nov 27,2023 19:50 #movies

రణ్‌బీర్‌ కపూర్‌ కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యానిమల్‌’. రష్మిక కథానాయిక. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, ఇటీవల కాలంలో అత్యధిక రన్‌టైమ్‌ (3 గంటలా 21 నిమిషాలు)తో వస్తున్న సినిమా కావడం కూడా గమనార్హం. తండ్రి అంటే విపరీతమైన ప్రేమ కలిగిన ఓ కొడుకు, అతడి కోసం ఎలా మారాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అవి ఏ పరిణామాలకు దారి తీశాయి? తెలియాలంటే సినిమా చూడాల్సిందేనని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.

➡️