త్వరలో మలేషియాలో తెలుగు సినీపరిశ్రమ 90 ఏళ్ల వేడుక : మంచు విష్ణు

 హైదరాబాద్‌ : తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకను మలేషియాలో ఘనంగా నిర్వహిస్తామని, సినీ పెద్దలతో చర్చించి త్వరలోనే ఈ వేడుకల తేదిని ప్రకటిస్తామని మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ … భారతీయ సినిమా పరిశ్రమలో తెలుగు సినిమా చరిత్ర చాలా గొప్పది అని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో నటీనటులుగా ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. జులైలో మలేషియాలో తెలుగు సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు. తెలుగు సినీ పరిశ్రమ ఘన కీర్తిని తొడ కొట్టి చెప్పాలనే ఈ వేడుకలు చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఈ వేడుకల గురించి ఫిల్మ్‌ ఛాంబర్‌తో చర్చించామన్నారు. జులైలో తెలుగు పరిశ్రమకు రెండు మూడు రోజులు సెలవు ఇవ్వాలని కోరామని, అందుకు ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు సానుకూలంగా స్పందించారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న ఐదు అసోసియేషన్‌ లతో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఒప్పందం చేసుకున్నామన్నారు. భారతీయ సినిమాను ఒకతాటిపైకి తీసుకురావడానికి మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ కఅషి చేస్తోందని మంచు విష్ణు వివరించారు.

➡️