సూర్య 44లో కొత్త నటులకు అవకాశం

Apr 24,2024 19:18 #movie, #surya

సూర్య, కార్తిక్‌ సుబ్బరాజు కాంబినేషన్లో తెరకెక్కబోయే ‘సూర్యా44’ చిత్రంలో నటించేందుకు నటీనటుల ఎంపిక చేపట్టారు. ఆసక్తిగల నటీనటులు దరఖాస్తు చేసుకోవచ్చని చిత్రయూనిట్‌ పేర్కొంది. తాజాగా కాస్టింగ్‌ కాల్‌ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. భాషతో సంబంధం లేకుండా ఎనిమిదేళ్ళ నుంచి 80 యేళ్ళ వయస్సున్న స్త్రీ పురుషులు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఒకటి నుంచి మూడు నిమిషాల నిడివి కలిగిన వీడియో కూడా పంపించాలని పేర్కొంది. పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌, లవ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని, సూర్య ద్విపాత్రాభినయం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. జూన్‌ 17 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రానికి తిరునావుక్కరసు ఛాయాగ్రహణం అందిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీత స్వరాలు సమకూర్చనున్నారు.

➡️