ఆర్‌ఓ సీల్‌ లేకపోయినా ఓటును తిరస్కరించొద్దు : ఇసి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆర్‌ఓ సంతకంతో సహా పూర్తి వివరాలు నింపివుంటే ఆయా ఓట్లు చెల్లుబాటవుతాయని, సీల్‌ వేయలేదనే కారణంతో ఆయా ఓట్లు తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కవర్‌పై ఓటరు సంతకం లేదనే కారణంతో కూడా ఓటును తిరస్కరించరాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా ఎన్నికల అధికారులకు స్పష్టం చేస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. ఫారమ్‌ 13-ఎ పై రిటర్నింగ్‌ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను దృవీకరించేందుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని సూచించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దఫా 4.44లక్షల మంది ఉద్యోగులు, వృద్దులు, వికలాంగులు, అత్యవసర సర్వీస్‌ ఓటర్లతో కలిపి 4.97లక్షల మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకున్నారు. ఫారమ్‌-13ఎలో ఓటరు సంతకం లేకపోయినా, ఆర్‌ఓ సంతకం లేక పోయినా, బ్యాలెట్‌ సీరియల్‌ నెంబర్‌ లేని పోస్టల్‌ బ్యాలెట్స్‌ను తిరస్కరించవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఓటు రికార్డు కాకుండా ఉంటే ఆ ఓటు చెల్లదు.

➡️