కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శుభాకాంక్షలు అరవింద్‌

Dec 4,2023 20:11 #New Movies Updates

‘తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమను ఆదుకోవడం హస్తం పార్టీకి కొత్తేమీ కాదు. ఇంతకుముందున్న ప్రభుత్వాలు కూడా సినీపరిశ్రమను ఎంతగానో ప్రోత్సహించాయి. ఈ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. త్వరలోనే ఇండిస్టీ తరపున కాంగ్రెస్‌ ప్రభుత్వ పెద్దలను కలుస్తాం’ అని సినీ నిర్మాత అల్లు అరవింద్‌ అన్నారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావటంపై ఆయన పై విధంగా సోమవారం స్పందించారు. రాబోయే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

➡️