11న డియర్‌ విడుదల

Apr 6,2024 19:25 #movie, #prakash kumar

నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌, నటి ఐశ్వర్యరాజేష్‌ జంటగా నటించిన చిత్రం డియర్‌. నటి రోహిణి, ఇళవరసు, తలైవాసల్‌ విజరు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నట్‌మగ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వరుణ్‌ త్రిపురనేని, అఖిషేక్‌ రామిశెట్టి, జి.పృధ్వీరాజ్‌ కలిసి నటించారు. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకత్వం వహించారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఈనెల 11న ఈ సినిమా విడుదల కానుంది. టీమిండియా క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఈ సినిమాలో నటించారు. తమిళంలో వస్తున్న ‘డియర్‌’లో అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్‌ కూడా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.

➡️